ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు పనిచేయాలన్నారు మంత్రి సీతక్క. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పేదలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని ఆదేశించారు. వెనుకబడిన జిల్లాలో పనిచేసేందుకు అధికారులు మనస్ఫూర్తిగా ఉండాలని సూచించారు. లేనట్లయితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు మంత్రి.
అదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క, బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నాలుగు జిల్లాల కలెక్టర్లతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.