అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి సీతక్క

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి సీతక్క

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : గత సంవత్సరంలో జరిగిన పొరపాట్లు పునరావతం కాకుండా ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. ఆదివారం ములుగు కలెక్టరేట్​లో జిల్లా ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలను తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరికి వరద ఉధృతం కావడంతో జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయని, మండలాల్లోని తహసీల్దార్, ఎంపీడీవోలు గుంపు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వైద్యులు గ్రామాలను సందర్శించి పారిశుద్ధ్య, గర్భిణులకు సేవలు అందించాలన్నారు. సీజనల్​ వ్యాధుల టైం కాబట్టి ప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశానికి తరలించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రానున్న 3 రోజులు మరింత క్లిష్టమైనవని, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, గ్రామపంచాయతీ, వైద్యశాఖ సమన్వయంతో పనిచేయాన్నారు. సమీక్షలో కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్, జిల్లా ఆఫీసర్లు పాల్గొన్నారు.