
హైదరాబాద్: సెర్ప్ లో 100% బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మంత్రి సీతక్క జీవో జారీ చేశారు. పదేండ్ల తర్వాత సెర్ప్ లో బదిలీలు జరుగుతున్నా యి. గత ప్రభుత్వ హయాంలో బదిలీలు జరగలే దు. మొత్తం 3974 మంది ఉద్యోగులు సెర్చ్ లో పనిచేస్తున్నారు. చాలా కాలంగా తమను బదిలీ చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సెర్ప్ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పాలసీ, మహిళా సంఘాలకు స్వయం ఉపాధి కల్పించడం, సంపద సృష్టి దిశలో తీర్చిదిద్దు తున్న ప్రభుత్వం సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం విశేషం. ప్రభుత్వం మహిళా సమాఖ్యల బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. బదిలీల తర్వాత కార్యక్రమాలు వేగ వంతంగా అమలయ్యే అవకాశం ఉందని ప్రభు త్వం భావిస్తోంది.