మహిళల భద్రత కోసం 5 రోజులు స్పెషల్ డ్రైవ్: సీతక్క

మహిళల భద్రత కోసం 5 రోజులు స్పెషల్ డ్రైవ్: సీతక్క

మహిళల భద్రత కోసం ఐదురోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నామన్నారు మంత్రి సీతక్క. సెక్రటేరియేట్ లో స్త్రీశిశుసంక్షేమశాఖపై రివ్యూ నిర్వహించారు. స్వల్పకాలిక ప్రణాళికలతోపాటు..దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఓపెన్ గా మాట్లాడే ధైర్యం కల్పిస్తామని చెప్పారు. సమాజం ఆలోచన మారేవిధంగా తమ ప్రణాళికలు ఉంటాయన్నారు సీతక్క.

ప్రజల్లో మార్పు తెచ్చేలా ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించాలని ఆదేశించారు. విద్యాసంస్థలు, ఇతర సంస్థల్లో అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దీనిపై మహిళా మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి కమిటీ వేస్తామని ప్రకటించారు. మహిళా సంఘాలతో కలిసి.. గ్రామస్థాయిలో సోషల్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బాధిత మహిళలకు ఈ యాక్షన్ కమిటీలు రక్షణ కవచంగా నిలుస్తాయన్నారు. మహిళలను వేధించకుండా పురుషులకు అవగాహన కల్పించాలన్నారు సీతక్క.