ఆడవాళ్లు తల్చుకుంటే ఏదైనా సాధ్యమే..మనకు సునీతా విలియయ్స్ ఆదర్శం : సీతక్క

ఆడవాళ్లు తల్చుకుంటే ఏదైనా సాధ్యమే..మనకు  సునీతా విలియయ్స్  ఆదర్శం : సీతక్క

ఆడవాళ్ళు తల్చుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు  మంత్రి సీతక్క. అందుకు  సునీతా విలియమ్స్  తమకు ఆదర్శమని చెప్పారు సీతక్క. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో 12వ స్త్రీ నిధి సర్వసభ్య సమావేశానికి సీతక్క ముఖ్య అతిథిగా హజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె..- పేదరిక నిర్మూలన సంస్థని 2011 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు. మహిళా సమాఖ్యలు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుండటం గర్వంగా ఉందన్నారు. జీరో నుంచి మొదలు పెట్టి 800 కోట్లకు చేరడం నిజంగా గర్వించదగ్గ విషయమన్నారు. సొంతంగా బ్యాంకు పెట్టడం ఆషామాషీ కాదని చెప్పారు.

మహిళాసాధికారత కోసం కృషి చేస్తున్న దివ్య దేవరాజన్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకోసం వడ్డీ లేని రుణాలు అందిస్తుందన్నారు. ఇప్పటికే 23 వేల కోట్లు అందించామని చెప్పారు. దీనివల్ల డైరీ, ఫౌల్ట్రీ, బేకరీ వంటి 2లక్షలకు పైగా వివిధ వ్యాపారాలు జరుగుతున్నాయని చెప్పారు. మరింతమందికి ట్రైనింగ్ అందించి… మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు.

ALSO READ | రేవంత్ మంచోడు కాబట్టే మీరింకా ఇలా ఉన్నారు.. లేదంటే..: MLA కోమటిరెడ్డి

మహిళా సంఘాలు ఎంతో మంది మహిళలకు మనోధైర్యాన్ని  ఇస్తున్నాయని  చెప్పారు సీతక్క. ఆర్ధిక భరోసాతో పాటు సామాజిక స్వేచ్ఛని అందిస్తుందన్నారు. మహిళా ప్రగతే… కుటుంబ ప్రగతి.. పౌష్టికాహారం కోసం ఇప్పపువ్వుతో లడ్డూలు చేపిస్తున్నామని తెలిపారు. వీటివల్ల ఐరన్ పెరుగుతుంది. కల్తీలేనటువంటి ఫుడ్ ని మహిళ సంఘాలు అందించాలని కోరారు సీతక్క