- కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ఎందుకు స్పందించలె
హైదరాబాద్:బీజేపీ మెప్పుకోసమే రాష్ట్ర బడ్జెట్ ను మాజీ సీఎం కేసీఆర్ విమర్శిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ పై స్పందించని కేసీఆర్, రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ ను నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తే కేసీఆర్ ఎoదుకు రాలేదని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్... రాష్ట్ర బడ్జెట్ ను విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. బీజేపీతో ఒప్పందం లో భాగంగానే అసెంబ్లీ కి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆరు నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు రావడమే అందుకు నిదర్శనమని సీతక్క అన్నారు.