లబ్ధిదారుల ఎంపికలో గ్రామ సభ నిర్ణయమే ఫైనల్: మంత్రి సీతక్క

హైదరాబాద్: ప్రతి ఒక్కరికీ ఇందిరా ఆత్మీయ భరోసా అందిస్తామని.. గ్రామసభ వేదికగానే అర్హుల గుర్తింపు, లబ్ధిదారుల ఎంపిక జరగాలని మంత్రి సీతక్క అన్నారు. అక్కడ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని.. దీనిపై అనవసర రాజకీయాలు తగదన్నారు. కూలీ భరోసాను విఫలం చేసే కుట్రకు కొన్ని శక్తులు ప్రయత్ని స్తున్నాయని.. గ్రామ సభల్లో కవ్వింపు చర్యల కు పాల్పడే అవకాశాలున్నాయని తెలిపారు. కూలీలు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ఆఫీసులో పంచాయతీ రాజ్ శాఖ అధి కారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీతక్క మాట్లాడారు. 'గణతంత్ర దినోత్సవం నుంచి ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం ప్రా రంభించబోతోంది. సొంత భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక చేయుత అందించబోతున్నం. 

Also Read : గూగుల్ మ్యాప్స్ ద్వారా కబ్జాలను గుర్తిస్తాం

దేశంలో ఏ రా ష్ఠంలో ఇలాంటి స్కీం లేదు. కూలీల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తున్నం. చిన్న పొరపాటు జరిగినా పేదలకు నష్టం వాటి ల్లుతోంది. అందుకే జిల్లా గ్రామీణాభివృద్ధి అధి కారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. చారిత్రాత్మక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను విజయవంతం చేయాలి. శాంతియుత వాతా వరణంలో గ్రామ సభలు జరిగేలా చర్యలు తీ సుకోవాలి' అని సూచించారు.

రుణమాఫీపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు

'కూలీలకు రూపాయి సహాయం చేయని బీఆర్ఎస్ పెద్దలు సైతం విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. రైతులకు, కూలీలకు పంచాయితీ పెట్టేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. అర ఎకరం ఉన్న రైతు కన్నా.. ఏ భూమి లేని కూలికే అధిక లబ్ది చేకూరుతుందని కూలీలను అమానిస్తోంది. రైతులకు రుణమాఫీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తోంది. రైతు భరోసా, పంట బోనస్ ద్వారా కౌలు రైతులకు, ఇం దిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా క కూలీలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నం. అభివృ ద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియ, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమల్లో తలెత్తే లోటుపాట్లను సవరిస్తం' సీతక్క తెలిపారు.