ఉపాధి సిబ్బంది, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్త.. ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి సీతక్క

ఉపాధి సిబ్బంది, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్త.. ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ సిబ్బంది, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో మంత్రి సీతక్క ఉపాధి హామీ జేఏసీ నేతలతో కలిసి ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. 

అనంతరం మంత్రి కేక్ కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..ఉపాధి హామీ చట్టం ఏర్పడి 20 ఏండ్లు  పూర్తయిందని చెప్పారు. ఉపాధి హామీ సిబ్బంది, ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో క్లియర్ చేస్తానని హామీ ఇచ్చారు. నాన్ ఫైనాన్షియల్ ఇష్యూలను త్వరలోనే  క్లియర్ చేస్తానని పేర్కొన్నారు. దీంతో మంత్రికి జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.