
- చేసిన అభివృద్ధి లేదు.. సబ్జెక్టు లేదు
- ఓట్ల విద్వేషాలు రెచ్చగొట్టవద్దు
- బండి సంజయ్ పై మంత్రి సీతక్క ఆగ్రహం
హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ చిల్లర మాటలు మానుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. 11 ఏండ్లుగా కేంద్ర ప్రభుత్వం యువతకు ,నిరుద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. ఏడాదికి రెండకోట్ల ఉద్యోగాలని చెప్పి .. 200 కూడా ఇవ్వలేదన్నారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధేమీ లేదని, చెప్పుకొనేందుకు సబ్జెక్టు లేదని అందుకే ఓట్ల కోసం ఇండియా, పాకిస్తాన్ అంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు.
నోరు తెరిస్తే హిందూస్తాన్, పాకిస్తాన్, హిందూ, ముస్లిం తప్ప మరో మాట తెలియదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు బీజేపీ కి లేదని అన్నారు. ఉన్నత విద్య మీద 18% జిఎస్టి విధిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నది ఎవరని ప్రశ్నించారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాలు విసిరారు. విద్వేషాలు పూరిత ప్రసంగాలు భారతీయుల ఐక్యతను దెబ్బతీస్తాయని అన్నారు.