రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు మంత్రి సీతక్క. ప్రజల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ప్లాట్లు అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ ది అని అన్నారు . రాహుల్ గాంధీ కుటుంబ త్యాగము, కష్టము నిజాయితీ ముందు కేటీఆర్ ఎంత అని ప్రశ్నించారు. చిట్ పేరుతో చాట్ చాట్ గా కాదు డైరెక్ట్ గా మాట్లాడాలని కేటీఆర్ కు హితవు పలికారు సీతక్క. గత మాజీ మహిళా మంత్రుల చరిత్ర.. ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసన్నారు. తాము నామినేట్ చేస్తే అప్పనంగా వచ్చినోళ్ళం కాదు.. ప్రజలు ఎన్నుకుంటే వచ్చామన్నారు.
Also Read :- మంత్రి సురేఖ గారూ.. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి
పనిగట్టుకుని తాము సినిమా వాళ్లపై మాట్లాడడ్లేదన్నారు సీతక్క. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుందన్నారు. సందర్భాన్ని బట్టి కొంతమంది సినీ ప్రముఖులపై మాత్రమే మాట్లాడారని చెప్పారు. పండగపూట కూడా తమ వెంటపడి అనవసరంగా తప్పుడు కూతలు కూసే కేటీఆర్.. మీ కుటుంబం, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారని హెచ్చరించారు. తమ బాధ ఆవేదన కేటీఆర్ కుటుంబ సభ్యులకు తప్పకుండా తగులుతుందన్నారు.