
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న.. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ గొంతై.. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నాడని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. బుధవారం గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పదేండ్లలో బీఆర్ఎస్ చేయలేని పనిని తాము ఏడాదిన్నరలో చేశామని, ఇందుకు తమను అభినందించాల్సింది పోయి విమర్శించడం ఏమిటని మండిపడ్డారు. రాహుల్ గాంధీతో పోల్చుకునే స్థాయి మల్లన్నది కాదని అన్నారు.