కొండా లక్ష్మణ్ బాపూజీ అణగారిన వర్గాల అభివృద్ధి కోసం తన పదవులను తృణపాయంగా వదిలేశారన్నారు మంత్రి సీతక్క. రవీంద్రభారతిలో కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల, సీతక్క ,జూపల్లి హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన సీతక్క.. బాపూజీ ఎక్కడ ఉంటే అక్కడ పోరాటం జరిగేదన్నారు. గాంధీ తరహాలోనే కొండా లక్ష్మణ్ అదే పంథాలో పోరాటం చేశారని చెప్పారు. బాపూజీ జయంతి, వర్ధంతిని అధికారంగా చేస్తామన్నారు సీతక్క.
ALSO READ | కొండాలక్ష్మణ్ బాపూజీకి సీఎం రేవంత్, ఎమ్మెల్యే వివేక్ నివాళి
పుట్టుకకు గిట్టుకకు మధ్య ఉన్న కాలంలో ఎలా బతికామాన్నదే మన జీవితాన్ని నిర్ణయిస్తదన్నారు మంత్రి సీతక్క. జనం కోసం పని చేస్తే జనంలో ఉంటావ్.. నీ కోసం పని చేస్తే నీలోనే ఉంటావని సీతక్క వ్యాఖ్యానించారు.
పోరాటాలకు మారుపేరు బాపూజీ
పట్టుదలకు, పోరాటాలకు మారు పేరు కొండాలక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నమ్మిన సిద్ధాంతం కోసం నడిచిన వ్యక్తన్నారు. బాపూజీ చివరికి వరకు కూడా తెలంగాణ కోసం పోరాటం చేశారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం కోసం తన ఇల్లునే త్యాగం చేసి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన గొప్ప వ్యక్తి బాపూజీ అని కొనియాడారు జూపల్లి. గడచిన 10 ఏళ్ళ పాలనను తలచుకుంటే అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు జూపల్లి.