
హైదరాబాద్: ఒక నియంత అధికారాన్ని కోల్పోయి మాట్లాడినట్లు కేసీఆర్ స్పీచ్ ఉందని మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. తన కుటుంబంలో చీలికలు, పేలికలు పెరుగుతున్నాయన్న బాధ కేసీఆర్లో కనిపించిందని సీతక్క చెప్పారు. పది నెలల్లో 59 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని, మీరెంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని ఆమె నిలదీశారు.
కేసీఆర్ బిడ్డ మంచి మంచి కార్లలో తిరుగుతుందని, తమ పేద ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో తిరగకూడదా అని సీతక్క ప్రశ్నించారు. కేసీఆర్ అంత దరిద్రంగా పోలీసులను ఎవరు వాడుకోలేదని దుయ్యబట్టారు. రూ. 60 వేల కోట్ల కరెంట్ బిల్లుల బకాయిలను పెట్టి వెళ్లిపోయాడని, ధర్నా చౌకుల్లో కేసీఆర్ ధర్నాలు కూడా చేయనీయలేదని మంత్రి విమర్శించారు. కెసిఆర్ సభ దగ్గర రైతుల కాలువలను పూడ్చి సభ నిర్వహించారు.
సొల్లు కబుర్లు అని కేసీఆర్ అసెంబ్లీని అవమానించాడని, మళ్లీ అసెంబ్లీకి వచ్చే అర్హత కేసీఆర్కు ఉందా అని సీతక్క నిలదీశారు. అసెంబ్లీ సొల్లు కబురు అయితే నీ కొడుకు, నీ అల్లుడ్ని అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నావని కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిపడ్డారు.