జువైనల్ హోమ్​కు డీ అడిక్షన్ సెంటర్ మంజూరు .. ప్రారంభించనున్న సీతక్క

జువైనల్ హోమ్​కు డీ అడిక్షన్ సెంటర్ మంజూరు .. ప్రారంభించనున్న సీతక్క

హైదరాబాద్, వెలుగు: డ్రగ్ ఎడిక్టెడ్ పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు జువైనల్ హోమ్​కు డీ అడిక్షన్ సెంటర్ మంజూరు చేస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. దీన్ని శనివారం సైదాబాద్ లోని జువైనల్ హోమ్ డైరెక్టరేట్ లో  మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. ఈ కేంద్రం నిర్వహణకు ప్రతి ఏటా కేంద్రం రూ.13.8లక్షలు ఇవ్వనుంది. ఇది మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఏర్పాటవుతున్న తొలి కేంద్రం అని అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఇందులో  ఒక సైకియాట్రిస్ట్, ఇద్దరు సైకాలజిస్టులు విధులు నిర్వర్తిస్తారు.

 డ్రగ్ ఎడిక్టెడ్ పిల్లలకు కౌన్సెలింగ్, మెడికల్ ట్రీట్ మెంట్, మెడిసిన్స్ ఇవ్వనున్నారు. వాళ్ల కుటుంబాలకు కూడా కౌన్సెలింగ్  ఇస్తారు.  బాధితులు పూర్తిగా కోలుకునేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోనున్నారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ కేంద్రం పనిచేయనుంది.