
- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
జన్నారం, వెలుగు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కోరారు. గురువారం మండల కేంద్రంలోని పైడిపల్లి పంక్షన్ హల్ లో నిర్వహించిన ఖానాపూర్ నియోజకవర్గం పట్టభద్రులు, కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు.
మెదక్, నిజామాబాద్,కరీంనగర్,ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ మద్దతునిచ్చిందన్నారు. రాబోయే ఐదురోజులు ప్రతి కార్యకర్త గ్రామాల్లోకి వెళ్లి పట్టభద్రులను కలిసి ఓటు వేయాలని కోరాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ లు ఒక్కటయ్యాయని విమర్శించారు. బీసీ కులగణన వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయన్నారు. కులగణన పూర్తి కాగానే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోం..
అటవీ అంక్షల పేరుతో రాత్రి వేళల్లో ఫారెస్ట్ చెక్ పోస్టుల వద్ద ఆఫీసర్లు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఉరుకునేది లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఫారెస్ట్ చెక్ పోస్టుల వద్ద ఆఫీసర్లు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముఖ్యంగా జన్నారం రేంజ్ ఆఫీసర్ సుస్మారావు, ఎప్డీపీటీ శాంతారాం నియంతలాగా ప్రవర్తిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమావేశంలో మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు.
సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్,ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, జీసీసీ చైర్మన్ కోట్నాక్ తిరుపతి, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, ఆదిలాబాద్ పార్లమెంటరీ నాయకురాలు ఆత్రం సుగుణ, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్, సీనియర్ నాయకులు సయ్యద్ ఇసాక్, సుభాశ్ రెడ్డి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.