
- నిధుల మంజూరులో కేంద్రం
- తన బాధ్యతను నెరవేర్చాలి: సీతక్క
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర తాగునీటి అవసరాలు తీర్చేందుకు నీతి ఆయోగ్ గతంలో సిఫార్సు చేసిన విధంగా కనీసం రూ.16 వేల కోట్లు మంజూరు చేయా లని కోరారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో రెండు రోజుల పాటు జరుగుతున్న అన్ని రాష్ట్రాల ఆర్ డబ్ల్యూఎస్, ఇరిగేషన్ మంత్రుల రెండో సదస్సులో మంత్రి సీతక్క మంగళవారం పాల్గొని ప్రసంగించారు.
కేంద్ర జలశక్తి శాఖమంత్రి సీఆర్ పాటిల్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల మంత్రులు పాల్గొన్న సదస్సులో.. తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ, ఇతర తాగు నీటి పథకాలు, రాష్ట్ర అవసరాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. నిధుల మంజూరు విషయంలో కేంద్రం తన బాధ్యతను నెరవేర్చాలన్నారు.