పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకుంటుందన్నారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గంగారం, కొత్తగూడ మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీతక్క .కూలిన ఇండ్లను, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మంత్రి సీతక్క వెంట ఎంపి పోరిక బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ఉన్నారు.
ఈ సందర్బంగా.. రైతులు ఆధైర్య పడొద్దని దైర్యం చెప్పారు సీతక్క. పంట నష్టపోయిన ప్రదేశానికి వెళ్ళి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆధికారులను ఆదేశించారు. ఎక్కడో కూర్చోని ఆధికారులు పంటనష్టంపై రిపోర్ట్ చేయొద్దని సూచించారు.
Also Read :- వరద బాధితులకు రూ. 10 వేల తక్షణ సాయం
సెప్టెంబర్ 3న మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని చెప్పారు సీతక్క. వర్షాలకు దెబ్బతిన్న పంటలను, రోడ్లను, ఇండ్లను పరిశీలించనున్నారని తెలిపారు. వర్షాలకు బాగా దెబ్బతిన్న మహబూబాబాద్ , భద్రాధ్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలకు సీఎం రూ.5కోట్లు కేటాయించారని వెల్లడించారు.