- రూ.50 వేల సాయం అందజేత
హైదరాబాద్, వెలుగు : బౌరంపేటలో లైంగిక దాడికి గురై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నాలుగేండ్ల చిన్నారిని మంత్రి సీతక్క పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. చిన్నారి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందన్నారు. తక్షణ అవసరాల కోసం రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. పాప తండ్రి మిత్రుడే కిరాతకానికి పాల్పడ్డాడని చెప్పారు. పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్టు చేశారని.. కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి వెంట మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ ఉన్నారు.