బాలికలపై అత్యాచారం, హత్యలకు కారణం గంజాయి, డ్రగ్స్ అని అన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ లోని మియాపూర్ నడిగడ్డ తండాలో జూన్ 7న బాలికపై అత్యాచారం, హత్య జరిగిన సంగతి తెలిసిందే.. ఇవాళ మహబూబాబాద్ మరిపెడ మండలం ఎల్లంపేటకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు సీతక్క. ఈ సందర్బంగా మాట్లాడిన సీతక్క.. హత్యలు, అత్యాచారాలకు కారణం గంజాయి, డ్రగ్స్. సీఎం రేవంత్ రెడ్డి గంజాయి, డ్రగ్స్ పై ఉక్కపాదం మోపుతున్నారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్వేచ్చనిచ్చారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది అని భరోసా ఇచ్చారు సీతక్క.
మహబూబాబాద్ జిల్లా మర్రి పేడ మండలం లక్ష్మ తండాకు చెందిన నరేష్,శారద దంపతులు కూలి పనుల కోసం 20 రోజుల క్రితం మియాపూర్ పరిధిలోని నడిగడ్డ తండాకు వచ్చి ఉంటున్నారు. జూన్ 7న ఇంటి నుంచి బయటకు వెళ్లిన బానోతు వసంత తిరిగి రాలేదు. పోలీసులు దర్యాప్తు చేయగా.. బాలిక వసంత మిస్సింగ్ అయిన ప్రాంతానికి 130 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం లభ్యమైంది. బాలిక మృతదేహం సగం ఖాళీ ఉంది. పాపను ఎవరో అత్యాచారం చేసి చంపారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.