నిమ్స్ లో విద్యార్థికి మంత్రి సీతక్క పరామర్శ​

నిమ్స్ లో విద్యార్థికి మంత్రి సీతక్క పరామర్శ​

పంజాగుట్ట,వెలుగు: మెదడు సంబంధిత వ్యాధితో నిమ్స్​ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టెన్త్ విద్యార్థి కార్తీక్(16) ను మంగళవారం మంత్రి సీతక్క పరామర్శించారు. భూపాల పల్లి జిల్లా రేగొండ మండలం గోర కొత్తపల్లి కి చెందిన కట్టయ్య కొడుకు కార్తీక్​ పాము కాటుకాటుకు గురయ్యాడు. అతని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ముందుగా అపోలో ఆస్పత్రిలో  చేర్పించారు.

మెరుగైన చికిత్సకోసం అక్కడి నుంచి నిమ్స్​లో చేర్పించారు.   కార్తీక్​ కుటుంబ సభ్యులకు మంత్రి ధైర్యం చెప్పారు. విద్యార్థికి అందించే ట్రీట్ మెంట్ పై   డాక్టర్లను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య చికిత్స అందించాలని మంత్రి సూచించారు.