రాష్ట్ర పంచాయితీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క వరంగల్ లో పర్యటించనున్నారు. డిసెంబర్ 17వ తేదీ ఆదివారం వరంగల్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.
ఆదివారం ఉదయం హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి మంత్రి సీతక్క రోడ్డు మార్గాన వరంగల్ కు బయలుదేరి వెళ్తారు. ఉదయం 9.15 నిమిషాలకు ములుగు మండలంలోని మహమ్మద్ గౌస్ పల్లికి చేరుకుంటారు. ఉదయం 10.15 నిమిషాలకు ములుగు గట్టమ్మ దేవాలయంలో సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11.30నిమిషాలకు ములుగు గట్టమ్మ నుండి రోడ్డు మార్గాన ర్యాలీగా బయలుదేరి మేడారం చేరుకుంటారు.
మధ్యాహ్నం 1.30 మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా అధికార యంత్రాంగంతో మేడారం జాతరపై సీతక్క సమీక్షిస్తారు. సాయంత్రం 4.30 నిమిషాలకు మేడారంలోని ఆదివాసి భవన్ లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 7.30 నిమిషాలకు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుని.. రాత్రికి అక్కడే బస చేస్తారు.