గ్రామీణ మహిళలను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు మంత్రి సీతక్క. గ్రామీణ మహిళల్లో లీడర్ షిప్, ఎంపవర్ మెంట్ పెంపొందించడంపై డెమోక్రాటిక్ సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి సీతక్క, కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి, సినీ నటి రెజీనీ కసండ్రా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క.. మహిళలు ఎంచుకునే రంగం స్పష్టంగా ఉండాలన్నారు. లక్ష్యాలు స్పష్టంగా ఉన్నప్పుడే టార్గెట్ రీచ్ అవుతామన్నారు. కొంత మంది ముందుకొచ్చిన ప్రతిసారీ వెనక్కి లాగేవాళ్లుంటారని అన్నారు. డబ్బులున్నవాళ్లే రాజకీయాల్లో రాణిస్తుంటారు.. రాజకీయాల్లోకి రావాలనుకునేవాళ్లకు ఇది ఇబ్బందేనన్నారు సీతక్క. సినిమా వేరు..రాజకీయం వేరని చెప్పారు.