తెలంగాణను కేసీఆర్​ కుటుంబం దోచుకుంది : మంత్రి శోభా కరంద్లాజే

  • కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే

హాలియా/దేవరకొండ, వెలుగు : బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని కేసీఆర్​ కుటుంబం దోచుకుంటుదని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంధ్లాజే ధ్వజమెత్తారు. గురువారం నల్గొండ జిల్లా హాలియా, దేవరకొండ పట్టణాల్లో వేర్వేరుగా నిర్వహించిన బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనేకమంది ప్రాణత్యాగంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ రాజకీయ పదవులు పొందుతున్నారని ఆరోపించారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఫసల్ బీమా అమలవుతున్నా తెలంగాణలో మాత్రం కేసీఆర్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. దేశ ప్రధానమంత్రి మోదీ రాష్ట్రానికి వస్తే ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ కలవాల్సి ఉన్నప్పటికీ ఆయన కలవకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.


ALSO READ: బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్రెడ్డి 

త్వరలో  జరిగే ఎన్నికల్లో బీజేపీ క్యాండిడెట్​ఎవరైనా సరే గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, జిల్లా ఎన్నికల పరిశీలకులు ప్రదీప్ కుమార్, స్టేట్​ ఎగ్జిక్యూటీవ్​ మెంబర్​ రిక్కల ఇంద్రసేనారెడ్డి రెడ్డి, నియోజకవర్గ నాయకులు డాక్టర్ పానుగోతు రవికుమార్ నాయక్, కంకణాల నివేదిత రెడ్డి, కొంపల్లి శ్రీనివాస్​, చలమల వెంకట్​ రెడి, చెన్ను వెంకట్​నారాయణరెడ్డి పాల్గొన్నారు.