విత్తనాల నాణ్యతపై రైతుల్లో అవగాహన పెంచాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

విత్తనాల నాణ్యతపై రైతుల్లో అవగాహన పెంచాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి 

గండిపేట, వెలుగు :  రాష్ట్రంలో ఫెస్టిసైడ్స్, బయో ఫెస్టిసైడ్స్ నాణ్యతా ప్రమాణాలు గుర్తించేందుకు ఓ వ్యవస్థ ని తీసుకురానున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల నాణ్యతపై రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆగ్రోకెం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘నాణ్యమైన దిగుబడి – రైతుల ఆదాయం పెంచడానికి నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల పాత్ర’పై రాజేంద్రనగర్ లోని వర్సిటీ ఆడిటోరియంలో  మంగళవారం సదస్సు జరిగింది. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

పీజేటీఎస్ఎస్ఏయూ -విస్తరణ విద్యాసంస్థ రూపొందించిన సంచార ప్రచార వాహనాలను, మొబైల్ అగ్రి సపోర్ట్ సర్వీసెస్(మాస్)ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయంలో నకిలీలను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా ఒక సమగ్ర చట్టం రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సదస్సులో వ్యవసాయ శాఖ కార్యదర్శి, వర్సిటీ ఇన్ చార్జి వీసీ ఎం.రఘునందన్ రావు, ఆగ్రో కెం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆర్జీ అగర్వాల్, ఎన్ఐఆర్డీ మాజీ డైరెక్టర్ జనరల్ డబ్ల్యూఆర్ రెడ్డి, ఎన్ఐపీహెచ్ఎం డైరెక్టర్ జనరల్ సాగర్ హనుమాన్ సింగ్, వర్సిటీ రీసెర్చ్ డైరెకర్ట్ పి.రఘురామిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతు, వర్సిటీ అధికారులు, రైతులు, డీలర్లు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.