పాలిచ్చే బర్రె కేసీఆర్​.. పనికిరాని దున్నపోతులు మనకెందుకు : సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి

పాలిచ్చే బర్రె కేసీఆర్​..  పనికిరాని దున్నపోతులు మనకెందుకు : సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి

వనపర్తి, వెలుగు : పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది కేవలం బీఆర్​ఎస్​ పార్టియే అని, పాలిచ్చే బర్రెలాంటి కేసీఆర్​ ఉండగా.. పనికి రాని దున్నపోతుల గురించి ఆలోచించడం దండగ అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఆయన పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.

వంట గ్యాస్​ ధరను రూ.400లకు తగ్గిస్తామని చెప్పారు. అందరికీ రేషన్ లో సన్నబియ్యం అందుతాయని హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లాకేంద్రంలో అన్యాక్రాంతమైన పలు చెరువులను పునరుద్దరించి ట్యాంక్ బండ్ లుగా మార్చి, వనపర్తి కి కొత్త వన్నెలు అద్దామని మంత్రి వివరించారు.

11 పార్కులను అహ్లాదకరంగా తీర్చిదిద్ది ఓపెన్ జిమ్ లు ఏర్పాటుచేశామని గుర్తు చేశారు. రూ.425 కోట్ల ప్రత్యేక నిధులతో వనపర్తికి ప్రతి రోజూ మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరా ప్రారంబించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పార్టీ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.