మహిళల భద్రత కోసం కోర్ కమిటీ ఏర్పాటు చేస్తం : మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: మహిళల భద్రత కోసం మంత్రులు, ఉన్నతాధికారులతో కోర్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ ప్యానెల్​కు అనుబంధంగా అన్ని డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లలో ఉమెన్ సేఫ్టీ కమిటీలు నియ‌‌‌‌‌‌‌‌మిస్తామ‌‌‌‌‌‌‌‌న్నారు. మహిళల సేఫ్టీ కోసం ప్రతి శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని తెలిపారు. ఈ మేరకు మహిళల సేఫ్టీకి తీసుకోవాల్సిన చర్యలపై సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో బుధవారం సీతక్క రివ్యూ చేశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘అమ్మాయిల భద్రతపై శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. ఆడ పిల్లలు, మహిళలను గౌరవించడంపై పాఠ్యపుస్తకాల్లో కొత్త పాఠాలను పొందుపరుస్తం. ప్రభుత్వ దవాఖాన్లు, మెడికల్ కాలేజీల్లో షీ టీమ్స్ ద్వారా గస్తీ పెంచుతం. అన్ని హాస్పిటళ్లు, పబ్లిక్ ప్లేసుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తం. గంజాయి, డ్రగ్స్, మద్యం మత్తుకు అలవాటైన వారిపై నిఘా పెంచుతాం’’అని సీతక్క అన్నారు..

 ప్రభుత్వం ప్రారంభించిన టీ సేఫ్ యాప్ మంచి ఫలితాలు ఇస్తున్నదన్నారు. ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన యాప్‌‌‌‌‌‌‌‌ను 15వేల మంది డౌన్​లోడ్ చేసుకున్నారని తెలిపారు. ‘‘మహిళలు జర్నీలో ఉన్నప్పుడు.. వర్క్ ప్లేసుల్లో వారి భద్రత కోసం ఈ యాప్ పని చేస్తుంది. ప్రమాదాన్ని గుర్తించి వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలా ఈ యాప్ అలర్ట్ చేస్తది. ఈ అప్లికేషన్ పనితీరును హీరో మాధవన్ కూడా ప్రశంసించారు. 

మరో ఏడు రాష్ట్రాలు ఈ యాప్​ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి”అని సీతక్క వెల్లడించారు. ఈ రివ్యూ మీటింగ్​కు మ‌‌‌‌‌‌‌‌హిళా క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న్ చైర్ పర్సన్ నేరెళ్ల శార‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌, మ‌‌‌‌‌‌‌‌హిళా స‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌కార అభివృద్ధి కార్పొరేష‌‌‌‌‌‌‌‌న్ చైర్ ప‌‌‌‌‌‌‌‌ర్సన్ బండ్రు శోభారాణి, మ‌‌‌‌‌‌‌‌హిళా శిశు సంక్షేమ శాఖ కార్యద‌‌‌‌‌‌‌‌ర్శి వాకాటి క‌‌‌‌‌‌‌‌రుణ‌‌‌‌‌‌‌‌, క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌నర్ కాంతి వెస్లీ, ఉమేన్ సేఫ్టీ డీజీ శిఖా గోయ‌‌‌‌‌‌‌‌ల్, ఐజీ రెమా రాజేశ్వరి, సీనియ‌‌‌‌‌‌‌‌ర్ మ‌‌‌‌‌‌‌‌హిళా ఐఏఎస్ లు అనితా రామచంద్రన్, శైల‌‌‌‌‌‌‌‌జా రామయ్యర్, ఐ అండ్ పీఆర్ క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర్ హ‌‌‌‌‌‌‌‌నుమంత రావు తదితరులు హ‌‌‌‌‌‌‌‌జ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌య్యారు. 

సీతక్కను కలిసిన బచ్‌‌‌‌‌‌‌‌పన్ బచావో ఆందోళన్​ డైరెక్టర్లు

బాల కార్మికులు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న బచ్‌‌‌‌‌‌‌‌పన్ బచావో ఆందోళన్ సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు సంపూర్ణ బెహరా, ధనంజయ్ తింగాల్ తదితరులు సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో బుధవారం మంత్రి సీతక్కను కలిశారు. తమ సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల వివరాలను ఆమెకు వివరించారు. పిల్లల హక్కుల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రికి వాళ్లు హామీ ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి నేతృత్వంలో బచ్‌‌‌‌‌‌‌‌పన్ బచావో ఆందోళన్ సంస్థ నిర్వహిస్తున్నారు.