ఎంతటివారైనా ఉపేక్షించొద్దు.. ఎస్పీకి మంత్రి సీతక్క ఆదేశం

హైదరాబాద్: భర్తతో గొడవ పడి ఇంటి నుండి బయటకు వచ్చిన ఓ మహిళపై అత్యాచారం జరిగింది. మహిళను నమ్మించి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనపై మంత్రి సీతక్క ఆరా తీశారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకితో సీతక్క ఫోన్‎లో మాట్లాడి.. మహిళపై దారుణానికి ఒడిగట్టిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించవద్దని ఆదేశించారు. 

నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని ఆదేశించారు. జిల్లాలో శాంతిభద్రలు కాపాడడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ జానకి సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. మహిళాపై అత్యాచార ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.