హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొలువుల జాతరను స్టార్ట్చేసిందని మంత్రి సీతక్క తెలిపారు. ఇవాళ బంజారాహిల్స్‌లోని పంచాయతీ రాజ్ఆఫీస్లో ఇటీవల నియమాక పత్రాలు అందుకున్న ఏఈఈల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్యూటీని నిబద్ధత, అంకితభావంతో పనిచేసి, ప్రజలకు సేవ చేయాలన్నారు. ‘బీఆర్ఎస్పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను పట్టించుకోలేదు. ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులను ఇబ్బందులు పెట్టింది. ఏళ్లకొద్ది నిరుద్యోగుల కష్టాలను కాంగ్రెస్ వచ్చిన తర్వాత దూరం చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. మేనిఫెస్టోలో ఇచ్చిన్నట్లు జాబ్క్యాలెండర్ప్రకటించారు. అధికారులుగా ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి. కష్టపడి పనిచేయాలి. మీ కుటుంబానికి, ప్రభుత్వానికి మంచి పేరును తీసుకురావాలి. పనితనంతోనే గుర్తింపు వస్తుంది. శాశ్వతంగా నిలిచిపోయేలా మీ పనులు ఉండాలి. నాణ్యతపై ఎక్కడ రాజీ పడొద్దు’ అని మంత్రి సీతక్క అన్నారు.