ఆదిలాబాద్, వెలుగు: ఆదిలబాద్ ఎంపీ సీటు గెలిచి సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ఆదివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. జిల్లా చరిత్రలోనే మొదటిసారి మహిళకు ఎంపీ సీటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేర్చిందన్నారు. జిల్లా అభివృద్ధికి తాము కట్టబడి ఉన్నామని, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామన్నారు. దేశంలో బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని, జనాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తోందని ఫైర్ అయ్యరు. పదేండ్లలో బీజేపీ, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో తలమడుగు జడ్పీటీసీ గణేశ్ రెడ్డి, నేతలు కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్ తదితరులు పాల్గొన్నారు.