సమగ్ర సర్వేను సక్సెస్ చేయాలి : మంత్రి సీతక్క

సమగ్ర సర్వేను సక్సెస్ చేయాలి : మంత్రి సీతక్క
  • ప్రజలందరూ భాగస్వాములు కావాలి : మంత్రి సీతక్క
  • కుల‌‌గ‌‌ణ‌‌న కోసం రాహుల్​ గాంధీ ఎంతో పోరాటం చేశారని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స‌‌మ‌‌గ్ర స‌‌ర్వేలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఊరూరా.. ఉత్సాహంగా.. వివ‌‌రాలు న‌‌మోదు చేసుకోవాల‌‌ని విజ్ఞప్తి చేశారు. మ‌‌హారాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి సీత‌‌క్క బుధవారం వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరూ అన్ని వివ‌‌రాలు న‌‌మోదు చేసుకోవాల‌‌ని సూచించారు.

 ‘‘కులగ‌‌ణ‌‌న‌‌తో దేశానికి మన రాష్ట్రం ఆద‌‌ర్శంగా నిలుస్తది. తెలంగాణ త‌‌ర‌‌హాలో దేశవ్యాప్తంగా కుల గ‌‌ణ‌‌న జ‌‌రిగితే అట్టడుగు వ‌‌ర్గాల‌‌కు, అభివృద్ధికి దూరంగా ఉన్న కులాల‌‌కు న్యాయం జరుగుతది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులగ‌‌ణ‌‌న జ‌‌ర‌‌గాలని ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారు. 

రాహుల్ గాంధీ సామాజిక విప్లవకారుడు. ఆయన కేవ‌‌లం రాజ‌‌కీయనేత మాత్రమే కాదు.. గొప్పవారియర్.. రిఫార్మర్​గా.. దేశం గుర్తు పెట్టుకుంటది. ఇచ్చిన మాట‌‌కు క‌‌ట్టుబ‌‌డి తెలంగాణలో కుల‌‌గ‌‌ణ‌‌న మొద‌‌లు పెట్టినం. దేశంలో కులగ‌‌ణ‌‌న‌‌కు మొద‌‌టి అడుగు తెలంగాణలో పడింది’’అని సీతక్క అన్నారు. ఎక్స్ రే లాగా కులగ‌‌ణ‌‌న జరిగిన‌‌ప్పుడే ప్రజల స్థితిగ‌‌తులు తెలుస్తాయన్నారు. కుల‌‌గ‌‌ణ‌‌న ప్రక్రియను ప్రారంభించిన సీఎం, స‌‌హ‌‌చ‌‌ర మంత్రుల‌‌కు సీత‌‌క్క ధ‌‌న్యవాదాలు తెలిపారు.

చికిత్స పొందుతున్న స్టూడెంట్ల ఆరోగ్యంపై ఆరా

కుమ్రంభీం ఆసిఫాబాద్ లోని వాంకిడి గిరిజ‌‌న ఆశ్రమ పాఠ‌‌శాల‌‌లో ఫుడ్ పాయిజ‌‌న్ కు గురై చికిత్స పొందుతున్న స్టూడెంట్ల ఆరోగ్య ప‌‌రిస్థితిపై ఆదిలాబాద్ ఇన్​చార్జ్ మంత్రి సీత‌‌క్క ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మ‌‌హారాష్ట్ర ప‌‌ర్యటనలో ఉన్నప్పటికీ.. డాక్టర్లు, కలెక్టర్, ఉట్నూరు ఐటీడీఏ పీవో, ఇత‌‌ర అధికారుల‌‌తో ఫోన్ లో మాట్లాడుతూ స‌‌మాచారం తెలుసుకుంటున్నారు.