దేశాన్ని వికాసం వైపు నడిపించిన దార్శనికుడుజవహర్ లాల్ నెహ్రూ : మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు : దేశాన్ని వెనుకబాటుతనం నుంచి వికాసం వైపు నడిపించిన దార్శనికుడు నెహ్రూ అని, ఆయనను ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే బాలల దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆధునిక భారతదేశం కోసం నెహ్రూ చేసిన సేవలను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పిల్లలను జాతి సంపదగా భావించి వారి భవితవ్యానికి, అభివృద్ధికి నెహ్రూ కృషి చేశారని చెప్పారు.