హైదరాబాద్: మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మంత్రి సీతక్క ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి కేక్ కట్ చేసి ‘హ్యాపీ బర్త్ డే రేవంతన్న’ అంటూ మంత్రి సీతక్క, ఇతర నేతలు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మహారాష్ట్రలో రేవంత్ అన్న బర్త్ డే జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్నందున రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రంలో నిర్వహించుకోలేకపోతున్నామని క్లారిటీ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని.. శక్తివంతంగా పరిపాలిస్తూ ప్రజా నాయకుడిగా ఎదగాలని ఆకాక్షించారు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా పలువురు మంత్రులు సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలియాజేశారు. రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆకాక్షించారు.
రాష్ట్రంలో విద్యా, వైద్య, ఉపాధి అవకాశాలపై శ్రద్ధ చూపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో పేదలు రైతుల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు’’ అని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సీఎంకు బర్త్ డే విషెస్ తెలియజేశారు.