హరీశ్.. గురివింద కథలు బంద్​చేయ్: మంత్రి సీతక్క

హరీశ్.. గురివింద కథలు బంద్​చేయ్: మంత్రి సీతక్క

హైదరాబాద్:  రుణమాఫీపై హరీశ్​రావు మాట్లాడితే గురివింద గింజ తన నలుపెరగదంట అనే సామెత గుర్తు వస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లుగా ఎనిమిది కిస్తీల్లో ఇచ్చే పైసలు కేవలం వడ్డీలకే  జమ కట్టారని మంత్రి సీతక్క ఫైర్​ అయ్యారు.  ఇవాళ మీడియాలో మాట్లాడారు..  పూర్తిగా రుణమాఫీ చేయక  హరీశ్ రావు​ఆర్థిక మంత్రి పదవిలో ఉండి రైతులు ఉసురుపోసుకున్నాడని విమర్శించారు.  ‘ మీరు పదేళ్లలో చేయని రుణమాఫీని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రూ. 18 వేల కోట్లతో 23 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసింది.  రైతుల గుండెల బాధలను తీర్చింది.