పేదరికం లేకుండా పోతే నా లక్ష్యం నెరవేరినట్టే: మంత్రి సీతక్క 

వరంగల్: సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లో వచ్చాను.. విప్లవ ఉద్యమం నుంచి వచ్చి ప్రజా సేవ చేస్తున్నారు.. కొందరు రాజకీయంగా నన్ను ఎదుర్కొ నే సత్తా లేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. పేదరికం లేకుండా పోతే నా లక్ష్యం నెరవేరినట్లే అన్నారు సీతక్క.

పోరాట ఫలితమే తెలంగాణ  సాధ్యం అయిందన్నారు. రాజకీయ నేతలు తప్పులు చేస్తే మేధావి వర్గం తట్టి చెప్పడానికి ముందుకు రావాలన్నారు. నా ఉద్యమ చరిత్రను కించ పరిచే విధంగా కొందరు దుష్ప్రచారం చేస్తు న్నారని అన్నారు.  కోట్ల ఆఫర్స్ వచ్చిన నేను పార్టీ మారలేదు.. వనరులను దక్కించుకునేందుకు పని గట్టుకొని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నా రు.