- పంచాయతీరాజ్‌శాఖతో నాకు పెద్ద బాధ్యత వచ్చింది
- రూరల్ఏరియాలకు ఐటీని విస్తరిస్తం
- సవాళ్లను చాలెంజ్లుగా తీసుకోవాలె
- వర్క్‌ప్లేస్‌లో మహిళలను వేధిస్తే సహించేది లేదు
- సేప్టీ కోసం టీసేఫ్యాప్తెచ్చాం మంత్రి సీతక్క
హైదరాబాద్:గ్రామీణ ప్రాంతాలకు ఐటీని విస్తరిస్తామన్నారు మంత్రి సీతక్క. వ్యాపారులు కేవలం పట్టణ ప్రాంతాల్లోనే పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారు..రూరల్ ఏరియాల్లో కూడా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలని కోరారు. మహిళలకు పరిశ్రమల్లో పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే సమాజంలో అంతరాలు తగ్గుతాయన్నారు.
ఎవరి మీద ఆధారపడకుండా కష్టాన్ని నమ్ముకున్న..మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పడు మంత్రిగా పట్టుదలతో ప్రజలకు సేవ చేస్తున్నానని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు తక్కువ అనే ఆలోచన నుంచి బయటకు రావాలని మంత్రి కోరారు.
శుక్రవారం( సెప్టెంబర్ 20) మాదాపూర్‌లోని టెక్ మహీంద్రా క్యాంపుస్లో సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ తెలంగాణ 10వ వార్షిక లీడర్షిప్సదస్సును సీతక్క ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మహిళలు సమాజ సృష్టికర్తలు అని అన్నారు. సమాజంలో మహిళలను చిన్నచూపు చూసే మోంటాలిటీ ఉంది.. అందుకే మహిళలు ఇంకా వెనకబడే ఉన్నారు. ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నా..పురుషులే గొప్ప అనే భావన ఉంది.
ఆదివాసీ మహిళకు పంచాయతీ రాజ్ శాఖను ఇచ్చారు. 13 వేల గ్రామపంచాయతీలు, రెండు కోట్ల మంది ప్రజలకు సేవ చేసే బాధ్యత వచ్చింది. అందుకే బాధ్యతగా పనిచేస్తున్నానన్నారు మంత్రి సీతక్క..
మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది.. వర్క్ ప్లేస్లలో మహిళలకు భద్రత లేదు.. సమస్యలపై వెంటనే ప్రశ్నించడం నేర్చుకోవాలి.. ఎదురవుతున్న సవాళ్లను మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు మంత్రి సీతక్క.. మహిళల సమస్యల పరిష్కారానికి మరిన్ని చట్టాలు తీసుకొస్తామన్నారు మంత్రి సీతక్క.
గ్రామీణ ప్రాంతాలకు ఐటీని విస్తరిస్తామన్నారు మంత్రి సీతక్క. వ్యాపారులు కేవలం పట్టణ ప్రాంతాల్లోనే పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారు.. రూరల్ ఏరియాల్లో కూడా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలని కోరారు. మహిళలకు పరిశ్రమల్లో పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే సమాజంలో అంతరాలు తగ్గుతాయన్నారు.
పరిశ్రమలు స్థాపించాలనుకునే మహిళా పారిశ్రామిక వేత్తలను మా ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు మంత్రి సీతక్క. మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళ భద్రతకోసం టీసేఫ్ యాప్ ను తీసుకువచ్చామన్నారు. యంగ్ ఇండియాలో నిరుద్యోగం పెద్ద సవాల్.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు మంత్రి సీతక్క.