ఒక్కో కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోండి : మంత్రి సీతక్క

ఒక్కో కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోండి : మంత్రి సీతక్క
  • రూరల్​ఏరియాల్లో విద్యావ్యవస్థలో మార్పుకు కృషి చేయండి 
  • అప్పుడప్పుడు అడవి గాలి పీల్చుకోండి 
  • మిమ్మల్ని దేవుళ్లుగా ఆరాధిస్తరు
  • గచ్చిబౌలిలో డిజిటల్​విద్య సదస్సును ప్రారంభించిన మంత్రి సీతక్క 

హైదరాబాద్:  సిటీలో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉందో,  మారుమూల పల్లెలో  డిజిటల్​విద్య  అందేలా  ఒక్కో కాంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని  మంత్రి సీతక్క కోరారు.   రాష్ట్రంలో ప్రతిపల్లెకు డిజిటల్​విద్యను విస్తరించి, విద్యావ్యవస్థలో మార్పులో భాగస్వామ్యం కావాలన్నారు.   ఇవాళ  గచ్చిబౌలిలో ఇన్పోసిస్​ క్యాంపస్​లో హైసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  డిజిటల్​ విద్య  సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మంత్రి  సీతక్క మాట్లాడారు.. రూరల్​ఏరియాల్లో విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారని తెలిపారు.  

రూరల్​ ఏరియాల్లో విద్యా అవకాశాలు ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉందన్నారు.  అదే టౌన్​ఏరియాల్లో మెరుగైన విద్య అందుతుందన్నారు. ‘  ప్రతి ఒక్కరి జీవితంలో ఎడ్యుకేషన్ అనేది చాలా కీలకం.  సారం లేని భూమి విద్య లేని జీవితం ఒక్కటే. అందుకే విద్య అనేది చాలా ముఖ్యం. దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే. సమాజంలో ఇంకా అంతరాలు ఉన్నాయి. 

ALSO READ | మూసీ పునరుజ్జీవానికి మేం వ్యతిరేకం కాదు: కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి

విద్యా బోధనలో కూడా అంతరాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే విద్యలో ఉన్న అంతరాలను తొలగించాలి. సమానత్వ సాధన దిశలో విద్య కీలకం.  గ్రామీణ విద్యార్థులు అవకాశం కల్పిస్తే బాగా రాణిస్తారు. అందుకే గ్రామీణ విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. అందుకు మీ వంతు సహకారం అందించండి. సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి. ఉన్నత విద్యావంతులున్న సమాజంలో కనీస విద్య లేనివారు సమాజంలో ఉండటం బాధాకరం.  పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే మా లక్ష్యం.  అప్పుడే అందరికీ సమాన అవకాశాలు అందుతాయి. అప్పుడు సమాజంలో పోరాటాలు ఉండవు.  మీరంతా గ్రామాలకు తరలండి.. అటవీ గ్రామీణ పరిస్థితులను చూడండి. 

విద్యా వ్యవస్థ సరిగా లేనిచోట పర్యటించి ప్రణాళిక రూపొందించండి. అప్పుడు మీరే మార్పునకు నాంది పలికిన వారు అవుతారు.  ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో విద్య అభివృద్ధికి కృషి చేస్తే దేవుళ్లుగా మిమ్మల్ని ఆరాధిస్తారు.    ఏసీ గదిలో పనిచేసే మీరు అప్పుడప్పుడు అడవి గాలి పీల్చుకోవాలి. ములుగుకి వచ్చి డిజిటల్ విద్య బలోపేతానికి కృషి చేయాలని’  మంత్రి  సీతక్క అన్నారు.