తెలంగాణలో ఫస్ట్ కంటెయినర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌

  • పోశాపూర్​లో ప్రారంభించిన మంత్రి సీతక్క
  • రూ.7 లక్షల ఖర్చుతో నాలుగు బెడ్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు

తాడ్వాయి, వెలుగు: రాష్ట్రంలోనే ఫస్ట్​టైమ్ ఒక కంటెయినర్‌‌‌‌‌‌‌‌ లో ఏర్పాటు చేసిన హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని పోశాపూర్‌‌‌‌‌‌‌‌లో మంత్రి సీతక్క ప్రారంభించారు. ఏడు లక్షల రూపాయలతో ఒక కంటెయినర్ లో నాలుగు బెడ్లతో ఈ చిన్న హాస్పిటల్​ను తయారు చేశారు. ఒక ఏఎన్ఎం, ఒక ఆశ కార్యకర్త ఇందులో విధులు నిర్వహిస్తారు. హాస్పిటల్ ప్రారంభం సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పోశాపూర్ సమీసంలో గుట్టలపై ఐదు గ్రామాలు ఉన్నాయని, ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వైద్యం అందక ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దివాకర్‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోనే తొలి కంటెయినర్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను ఇక్కడ ప్రారంభించామని చెప్పారు. దీంతో ఇక్కడి ప్రజలకు వైద్యం సాయం అందుతుందన్నారు. కార్యక్రమంలో ములుగు కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దివాకర్‌‌‌‌‌‌‌‌, ఎస్పీ శబరీశ్‌‌‌‌‌‌‌‌, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీజ తదితరులు పాల్గొన్నారు.