సోషల్ మీడియాలో చిన్నారిపై.. అసభ్యకర వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం

సోషల్ మీడియాలో చిన్నారిపై.. అసభ్యకర వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం

సోషల్ మీడియాలో ఓ చిన్నారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని అసభ్యంగా వక్రీకరించడం దారుణమన్నారు సీతక్క.  సోషల్ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడిన దుర్మార్గుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ ఘటనపై ఇప్ప టికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా, అసభ్యకర ప్రచారాలు చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీతక్క.