IAS స్మితా సబర్వాల్‍ కామెంట్స్‌పై మంత్రి సీతక్క సీరియస్

IAS స్మితా సబర్వాల్‍ కామెంట్స్‌పై మంత్రి సీతక్క సీరియస్

తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క, IAS అధికారి స్మితా సబర్వాల్ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. సివిల్స్ లో దివ్యాంగుల రిజర్వేషన్ గురించి స్మితా సబర్వాల్ ట్విట్ గత రెండు రోజులుగా చర్చనీయాంశమైంది. దీనిపై సివిల్స్ మెంటర్ బాలలతా సోవమారం స్పందించారు. యూపిఎస్సీలో దివ్యాంగుల రిజర్వేషన్లు వ్యతిరేఖిస్తూ చేసిన కామెంట్స్ పై ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని బాలలత డిమాండ్ చేశారు.

ఈ మేరుకు మంగళవారం మంత్రి సీతక్క IAS అధికారులు అంటే బాధ్యతగా ఉండాలని స్మితాకు సూచించారు. ఉన్నతాధికారి హోదాలో ఉండి దివ్యాంగులపై అలా మాట్లాడడం సరికాదన్నారు మంత్రి సీతక్క. ఇలా వైకల్యాన్ని కించపరచవద్దని చెప్పారు. దివ్యాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి వాళ్లు బుద్ది వైకల్యాన్ని చూపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. స్మిత సబర్వాల్ సీఎం రేవంత్ నోటీసులో ఉన్నాయన్నారు.