ములుగు, వెలుగు: మే 13న జరుగనున్న పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్అత్యధిక సీట్లను గెలువబోతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్దనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు.
ప్రజా ఆకాంక్షలను నెరవేర్చనందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్ను ప్రజలు దూరం పెట్టారన్నారు. ములుగు మండలంలోని ఇంచర్ల, జంగాలపల్లి, జగ్గన్నపేట, మల్లంపల్లి, మహ్మద్ గౌస్పల్లి గ్రామాల పరిధిలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన మంత్రి సీతక్క ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను గెలిపించాలని కోరారు.
సీతక్క మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు పని కల్పించేందుకు ఉపాధిహామీ పథకం తీసుకువచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఉపాధి కూలీలకు రోజుకు రూ.400 చెల్లిస్తామన్నారు.
ఓటమి అంచున ఉన్న బీజేపీ నాయకులు ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతూ జైళ్లకు పంపుతున్నారన్నారు. జీఎస్టీ తీసుకువచ్చిన బీజేపీ సర్కారు రూ.54 లక్షల కోట్లను పేదల నుంచి వసూలు
చేసిందన్నారు.