హైదరాబాద్: తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ పండగని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్లో ఇవాళ (అక్టోబర్ 5) తెలంగాణ ఎలక్ట్రిసిటి ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై.. మహిళా ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ALSO READ | Bhatukamma Special : 4వ రోజు నాన బియ్యం బతుకమ్మ
బతుకమ్మ మన ప్రకృతి పండుగ అన్న సీతక్క.. ఆడపడుచులు, కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిలు అమ్మగారి ఇంటికి వచ్చే ఆడవాళ్ల పండుగని అన్నారు. మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్న మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాబోయే తరాలకు మన పండుగలను , సంస్కృతిని అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ ఘనంగా బతుకమ్మ ఏర్పాట్లు చేశారని కొనియాడారు.