మహబూబాబాద్ జిల్లా: రెండు రోజులుగా తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు వరద బీభత్సాన్ని సృష్టించింది. మహబూబాబాద్ జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ పట్టణంలో సోమవారం మంత్రి సీతక్క పర్యటించారు. వరద బాధితులను మంత్రి సీతక్క పరామర్శించి.. భరోసా ఇచ్చారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను, కూలిన ఇండ్లను ఆమె పరిశీలించారు.
పంట నష్టం, ఆస్తి నష్ట పోయిన బాధితులు మంత్రి సీతక్కకు తమ గోడు వెల్లబోసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పి.. ప్రభుత్వం తరుపున అన్ని విధాల ఆదుకుంటామని సీతక్క హామి ఇచ్చారు. దెబ్బతిన్న రోడ్లను, కూలిన ఇండ్లపై ఆరా తీసి ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించమని కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేశారు మంత్రి. మినిస్టర్ సీతక్క తోపాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సూధీర్ రాంనాధ్ కేకన్ ఉన్నారు.