ములుగు జిల్లాలో భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు

ములుగు జిల్లాలో భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు

ములుగు జిల్లాలో  భారీ వర్షాలు పడుతున్నాయి.ఈ క్రమంలో    కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్, ఎస్పీ అడిషనల్ కలెక్టర్  మండల ప్రత్యేక అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా.. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు  అప్రమత్తంగా ఉండాలని సూచించారు.   అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దన్నారు . గత సంవత్సరంలో జరిగిన పొరపాట్లు ఇప్పుడు మనం చెయ్యద్దని చెప్పారు. జిల్లాలో గత మూడు రోజులుగా నిరంతరంగా వర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో  అధికారులు అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా తరలించాలని సూచించారు మంత్రి సీతక్క. వరదల నేపథ్యంలో  పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి, ప్రజలను తరలించాలన్నారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు  సూచించారు. ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద హెచ్చరిక బోర్డుల పెట్టాలని చెప్పారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రోజెక్ట్ లలోని నీటి మట్టాలను ఎప్పటి కప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు సీతక్క.