రాహుల్ ప్రధాని అయితరు : సీతక్క

  •     ములుగు జిల్లా జగ్గన్నపేటలో ఓటేసిన మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని మంత్రి సీతక్క అన్నారు. సీతక్క సొంతూరైన ములుగు జిల్లా జగ్గన్నపేటలో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో విద్వేష పూరిత రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగించడమే సరైందన్నారు. 

పేదలకు సాయం చేయలేని మూఢత్వంలో కొందరు ఉన్నారని, అది సరికాదని చెప్పారు. దేశంకోసం ధర్మం కోసం అంటూ మాట్లాడేవారు స్వాతంత్ర పోరాటంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ, నెహ్రూ హయాంలో ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేశారని, ఉద్యోగాలు సృష్టించారని చెప్పారు. కానీ, ప్రస్తుతం ఆ సంస్థలన్నింటినీ అమ్ముతున్నారని ఆరోపించారు. అదానీ, అంబానీల కోసం దేశాన్ని తాకట్టు పెడుతున్నోళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.