- మీడియాతో మంత్రి సీతక్క చిట్‌చాట్
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్యం కనిపిస్తున్నదని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీ పోడియంలోకి వెళ్లినా.. ప్లకార్డులు ప్రదర్శించినా గత బీఆర్ఎస్ సర్కార్ సభ్యులను సస్పెండ్ చేసేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అలా చేయడం లేదన్నారు. తెలంగాణ ఏర్పడిందే నియామకాల డిమాండ్‌తో అని.. అలాంటి జాబ్‌ల గురించి బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 30వేల ఉద్యోగాలతో పాటు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. బుధవారం అసెంబ్లీలోని తన చాంబర్లో సీతక్క మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘‘అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలకు నిరుద్యోగులు గుర్తుకొచ్చిన్రు. పదేండ్లు ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఏం చేసిన్రు? జాబ్ క్యాలెండర్ కోసం బీఆర్ఎస్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉన్నది. ఉద్యోగ భర్తీల్లో ఉన్న అడ్డంకులు తొలగిస్తూ నోటిఫికేషన్లు ఇస్తున్నం’’అని అన్నారు.