వనదేవతల జాతరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం: మంత్రి సీతక్క

ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరిగే మేడారం మహా జాతరకు మంత్రి సీతక్క అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అత్యంత వైభవంగా సమ్మక్క సారలమ్మల జాతర నిర్వహిస్తామన్నారు. గురువారం రాత్రి మేడారంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో కలిసి అమ్మవార్ల గద్దెల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. 4000 వేల మంది పారిశుధ్య కార్మికులు, వైద్యశాఖ నుంచి 30 ప్రత్యేక హెల్త్ క్యాంప్స్, అంబులెన్స్ లు, ఆర్టీసి మహిళ సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాలు  ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో 14 క్లస్టర్లు, 279 యూనిట్స్ ద్వారా 5,532 టాయిలెట్స్ ఏర్పాటు చేసినట్లు ఆ జిల్లా మంత్రి తెలిపారు. వీఐపీ, వివీఐపీల తాకిడితో సాధారణ  భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

Also Read : అసెంబ్లీకి ఆటోల్లో వచ్చిన ఎమ్మెల్యేలు