గంజాయి మత్తులో రేప్‌‌లు, మర్డర్లు : మంత్రి సీతక్క

జయశంకర్‌‌ భూపాలపల్లి, ఏటూరునాగారం, వెలుగు: గంజాయి మత్తులోనే అత్యాచారాలు, హత్యల సంఖ్య పెరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు టీమ్‌‌లుగా ఏర్పడి గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని అరికట్టాలన్నారు. ఇంకా కొంతమంది పోడు రైతులకు పట్టాలు వచ్చేది ఉందని, అప్పటి వరకు వారిని వేదించకుండా ఫారెస్టు ఆఫీసర్లు సంయమనం పాటించాలని మంత్రి  సూచించారు. 

సీజన్ వ్యాధులపై వైద్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. కావాల్సిన మందుల నిల్వలను ముందస్తుగా తెచ్చిపెట్టుకోవాలని డీఎంహెచ్​వో అప్పయ్యకు సూచించారు.  అనంతరం తాడ్వాయి మండలంలో అత్యాచారానికి గురై హత్య చేయబడిన అంగన్​వాడీ టీచర్​రడం సుజాత కుటుంబ సభ్యులను చిన్నబోయినపల్లిలో మంత్రి సీతక్క పరామర్శించి, ప్రభుత్వం తరపున రూ.50వేల చెక్కును అందజేశారు.

 అనంతరం మంగపేట మండలం నర్సింహసాగర్ గ్రామస్తుల కోరిక మేరకు ఆర్టీసీ బస్సు సర్వీసును సీతక్క ప్రారంభించారు. ఈ మేరకు బస్టాండు నుంచి ఐటీడీఏ వరకు ఫ్రీ టీకెట్ తీసుకుని బస్సులో ప్రయాణించారు. కార్యక్రమంలొ ఏపీవో వసంతరావు, డీడీ పోచం, ఎర్రయ్య, ఏవో రఘు, ఎస్వో రాజ్​కుమార్, మేనేజర్ శ్రీనివాస్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.