చదువుకు పేదరికం అడ్డు కాదు : మంత్రి సీతక్క

తాడ్వాయి, వెలుగు : చదువుకు పేదరికం అడ్డు కాదని మంత్రి సీతక్క చెప్పారు. సోమవారం మేడారం జాతర పనుల పరిశీలనకు వెళ్తున్న మంత్రి మార్గమధ్యలో స్టూడెంట్లతో వెళ్తున్న ఓ బస్సు ఆపి అందులోకి ఎక్కి స్టూడెంట్లతో మాట్లాడారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచిగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని సూచించారు. స్టూడెంట్లకు ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం తరఫున అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

మృతుల ఫ్యామిలీలకు పరామర్శ

మంగపేట, వెలుగు : మంగపేట మండలం కమలాపురానికి చెందిన, ఇటీవల తమిళనాడులో జరిగిన ప్రమాదంలో చనిపోయిన సుబ్బయ్య నాయుడు, నర్రా సాంయ్య, జర్పుల రాము, నిమ్మల వెంకటరాజు ఫ్యామిలీలను సోమవారం మంత్రి సీతక్క పరామర్శించారు. మృతుల ఫ్యామిలీలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఇటీవల గోదావరిలో గల్లంతైన రాము ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌ను కూడా పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌‌‌‌ పటేల్‌‌‌‌, మంగపేట మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, నాయకులు చింతా పరమాత్మ, శ్యాంలాల్‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.