- 10 ఎకరాల్లో చెత్త రీసైక్లింగ్‌సెంటర్ అభినందనీయం
- సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించిన సీతక్క
మేడిపల్లి, వెలుగు: సేకరించిన చెత్తను ఎక్కడ డంప్‌చేయాలి, దుర్వాసన రాకుండా ఎలా ప్రాసెస్చేయాలి అనేది అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అతిపెద్ద సమస్య అని మంత్రి సీతక్క అన్నారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంను స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేయర్ అమర్ సింగ్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. రాష్ట్రంలో మొదటిసారి ఐటీసీ సహకారంతో పీర్జాదిగూడలో 10 ఎకరాల విస్తీర్ణంలో చెత్త రీసైక్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి చెత్తను ఎరువుగా మార్చడం అభినందనీయమన్నారు. ఇలాంటి ప్లాంట్లను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లలో ఏర్పాటు చేసేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తానని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేశ్‌యాదవ్, బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కమిషనర్ త్రిలేశ్వరరావు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. కాగా, కార్యక్రమం జరుగుతున్న టైంలో మంత్రి సీతక్క ఎదుట బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. డంపింగ్ యార్డును శాశ్వతంగా తరలించాలని నినాదాలు చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించారు.
మేడిపల్లి ప్రెస్ క్లబ్ డైరీ ఆవిష్కరణ
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని దేవీ కన్వెన్షన్ హాల్ లో బుధవారం మేడిపల్లి మండల ప్రెస్ క్లబ్ డైరీ ఆవిష్కరణ జరిగింది. మంత్రి సీతక్క పాల్గొని ఆవిష్కరించారు. టీయూడబ్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.