![రిజర్వేషన్ల ద్వారా ఎదిగి జాతిని మర్చిపోవద్దు.. సేవాలాల్ జయంతి వేడుకల్లో మంత్రి సీతక్క](https://static.v6velugu.com/uploads/2025/02/minister-sitakka-say-that-dont-forget-the-community-after-developing-through-reservations_x3wI59VuOH.jpg)
రిజర్వేషన్ ద్వారా ఎదిగి జాతిని మర్చిపోవడం అంటే.. ఆ జాతి మనుగడను దెబ్బ తీయడమేనని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ (ఫిబ్రవరి 15) హైదరాబాద్ బంజారా భవన్ లో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా.. సమాజ శాంతి కోసం బంజారాల అభివృద్ధి కోసం పాటు పడిన మహనీయుడు సేవాలల్ అని తెలిపారు. చరిత్ర లేకుండా వర్తమానం ఉండదని, - మనం ఎంత ఎదిగినా జాతి మూలాలు, వేష భాషలను మర్చిపోవద్దని అన్నారు. మూలాలను మర్చిపోతే హక్కులు అడిగే అధికారం ఉండదని.. ఉన్నత స్థానాల్లో ఉన్న నాయకులు, అధికారులు... సమాజానికి సేవ రూపంలో తిరిగి ఇవ్వాలని సూచించారు.
Also Read : ఢిల్లీలా హైదరాబాద్ను కానివ్వం
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రవేశ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమని మంత్రి సీతక్క గుర్తు చేశారు. ఐటీడీఏ లను పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ మూలాలు మర్చిపోకుండా.. భవిషత్ తరాలకు అందిస్తూ.. అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపనిచ్చారు. చేసిన మంచి, విలువైన మాటలు, ఆచరించిన సన్మార్గం... సమాజానికి చేసిన సేవ తోనే... సేవాలాల్ ను ఇప్పుడు స్మరించుకుంటున్నామని, అందరూ మహనీయుల బాటలో నడవాలని పిలుపునిచ్చారు సీతక్క.